తెలంగాణలో ఒకవైపు కేసీఆర్ ప్రభుత్వ విధానాలతో, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి, కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చి హైదరాబాద్ ఇమేజ్ పెంచే కార్యక్రమంలో బిజీగా ఉంటే, ఈ మధ్య NTV తెలుగు ఛానల్ ప్రసారం చేసే అసత్య వరుస కథనాలు మాత్రం హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఉన్నాయి.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఢమాల్ అంటూ, అపార్ట్మెంట్ వద్దు ల్యాండ్ ముద్దు అంటూ ఒకే కథనాన్ని వారానికి రెండు సార్లు చెప్పిందే చెప్పి, చెప్పినదాన్నే అటు తిప్పి ఇటు తిప్పి సామాన్య మధ్య తరగతి వాడి ఆశల్ని తొక్కేస్తున్నారు.
హైదరాబాద్ లో జాబ్ చేసే ప్రతీ ఒక్కడి కల ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవాలని. దానికోసం జమ చేసుకున్న డబ్బులు అడ్వాన్స్ ఇచ్చి, వచ్చే జీతంలో కాస్త కష్టమైనా లోన్ తీసుకొని ఈఎంఐ కట్టుకొని ఆ ఇంటిని సొంతం చేసుకుంటాడు.
అయితే ఎన్టీవీ కథనాలు చూసిన ప్రేక్షకులు మాత్రం భయాందోళనలకు గురవుతున్నారు. ఇల్లు కొనుక్కోవాలనుకునే ప్రతీ వాడు ఆవేదన చెందుతున్నాడు.
అపార్టుమెంట్లు వద్దు, ల్యాండ్ కొనుక్కోమని చెప్తుంది ఎన్టీవీ. ల్యాండ్ కొనుక్కునే స్తోమత ఉంటే రెంట్ ఇంట్లో ఎందుకుంటారు సార్? నిజంగానే రియల్ ఎస్టేట్ ఢమాల్ అయి అపార్టుమెంట్ల రేట్లు తగ్గితే అది సామాన్యుడికి మంచిదే సార్. ఎందుకంటె అపార్టుమెంట్లు కొనుక్కునేది రెంట్ ఇండ్లలో ఉండే బదులు సొంతింట్లో ఉండొచ్చనే ఆలోచనతో కానీ తిరిగి అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి కాదు. ఇంత చిన్న లాజిక్ మర్చినట్టుంది ఆ ఛానల్. కథనాలు ఏమో రియల్ ఎస్టేట్ ఢమాల్ అని వేస్తారు, బ్రేక్స్ లో మాత్రం రియల్ ఎస్టేట్ సంస్థల ప్రచారం చేస్తారు. సర్వే చేసాం అని చెప్పుకుంటున్న ఎన్టీవీ ఏ మెథడ్ లో సర్వే చేసింది? ఎన్ని శ్యాంపిల్స్ తీసుకుంది? ఎన్టీవీ తో కలిసి చేసిన ఆ ఇంటర్నేషనల్ సంస్థ గురించి ఎందుకు కథనంలో పేర్కొనలేదు? వీటికి ఎన్టీవీ దగ్గర సమాధానాలున్నాయా? లేదా మీడియా ఏం చెప్పినా జనాలు నమ్మేస్తారనే అలా చెప్పారా?
అపార్టుమెంట్లు కడుతున్న సంస్థల యాజమాన్యాలకు ఆత్మహత్యలే శరణ్యం అని మరీ వేశారు, ఇంకో వైపు అపార్ట్మెంట్ కొనుక్కుంటే అంతే సంగతులు అని సామాన్యుడిని భయపెడుతున్నారు.
Comments
Post a Comment